బాలకృష్ణ- క్రిష్ కాంబోలో రానుంది ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. రీసెంట్‌గా మూవీ ప్రారంభం కావడంతో సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందన్నదానిపై సినీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఇందులోని ప్రతిసీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్కెచ్ వేస్తున్నాడు డైరెక్టర్. హిస్టరీ నేపథ్య మూవీ అనగానే ముందుగా కాస్ట్యూమ్స్ అందరికీ గుర్తుకొస్తాయి. బాహుబలి, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలు హిట్ కావడం వెనుక కాస్ట్యూమ్స్‌దే కీలకపాత్ర. ఈ ఫిల్మ్‌నీ ఆ రేంజ్‌లో చేయాలనుకుంటున్నాడు క్రిష్. అలాగే ఈ సినిమాలోని మరిన్ని విషయాలపై పరిశోధకులు, ఆర్కియాలజీ నిపుణులతో కలసి లోతుగా పరిశీలిస్తున్నాడు. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్ ఖరారు చేయనున్నారని యూనిట్ చెబుతోంది.
మరోవైపు ఐదు మేజర్ సెట్స్‌పై మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందులో చెప్పుకోదగినది ఆనాడు శాతకర్ణి పాలించిన నగరం అమరావతి. ఇటు హిస్టరీ బేస్డ్ సినిమాలకు లొకేషన్స్ చాలా కీలకం. వందల ఏళ్ల చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను సృష్టించడం సెట్టింగ్స్‌కే బోలెడంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే వార్ సీన్స్‌కు మొరాకోను ఎంపిక చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం. దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. దాదాపు 3 నెలలపాటు యూనిట్ అక్కడ మకాం వేయబోతోందట. మొత్తానికి అలనాటి శాతవాహన రూలర్‌ని కళ్లకు కట్టినట్టు చూపించనున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.
No comments:
Post a Comment