Sunday, 24 April 2016

ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్లాన్ చూస్తే షాక‌వ్వాల్సిందే

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన గురించి హాట్ హాట్‌గా డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. స‌ర్దార్ సినిమా రిలీజ్‌కు ముందు ప‌వ‌న్ తాను మ‌రో మూడు నాలుగు సినిమాలు మాత్ర‌మే చేస్తాన‌ని…వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న జ‌న‌సేన రాజ‌కీయంగా బ‌రిలోకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మిగిలిన పార్టీల‌న్ని అలెర్ట్ అవ్వ‌డంతో పాటు ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ప‌వ‌న్ ఎవ‌రి వైపు అయినా ఉంటాడా ? లేదా ఒంట‌రిగానే పోటీ చేస్తాడా అని ఎవ‌రికి వారు చ‌ర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ తన దగ్గర ఎన్నికలను నడిపేంత డబ్బు లేదని.. అందుకే ఇంకొన్ని సినిమాలు మాత్రమే చేసి బయటకు వచ్చేస్తానని కూడా చెప్పారు. అలాగే 2019 కల్లా పూర్తి స్థాయి పార్టీని, కార్యాచరణను నిర్మించడానికి పవన్ ఇప్పటి నుంచే చాలా సీక్రెట్‌గా ప‌నులు స్టార్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.
ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం తన అనుచర గణాన్ని రంగంలోకి దింపి ప్రస్తుత రాజకీయాల పట్ల ప్రజల్లో అంతర్గతంగా ఉన్న అభిప్రాయాలను, తన నుంచి వాళ్లేమి ఆశిస్తున్నారు… అస‌లు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి పాల‌న కావాల‌నే దానిపై సీక్రెట్ చేయిస్తున్నాడ‌ని స‌మాచారం. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ అభిమానులు విజ‌య‌వాడ‌లో మీటింగ్ కూడా పెట్టి పార్టీ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. అలాగే త్వరలో పవన్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. 2019 ఎన్నిక‌ల టార్గెట్‌గా ప‌వ‌న్ ఆడుతున్న ఈ న్యూ పొలిటిక‌ల్ గేమ్ ఎలా ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌డ పుట్టిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment