తెలంగాణ మంత్రివర్గంలో శాఖల మార్పు షురూ అయ్యింది. రాష్ట్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులకు గవర్నర్ నరసింహన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిఎం కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఫలితంగా కేటీఆర్‌కు పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, మైనింగ్, విదేశీ వ్యవహారాలు జూపల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి.
తలసానికి పశుసంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫీ. పోచారానికి వ్యవసాయంతో పాటు అదనంగా సహకారశాఖ అప్పగించినట్టు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవలే పురపాలకశాఖను అదనంగా అందుకున్న ఐటి మంత్రి కెటిఆర్ కు పరిశ్రమలు, మైనింగ్ కూడా అప్పగించారు.